NCPCR సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫామ్లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSEAM) ప్రకటనలు కనిపించాయన్న ఆరోపణలపై విచారణను కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్కు కమిషన్ మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. BBC Eye కథనం ఆధారంగా జూలై 3న NCPCR ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది.