భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు చీలమండ గాయం కారణంగా 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్ ఫైనల్లోనూ అతడు పాల్గొనలేడు. శిక్షణ సమయంలో లిగమెంట్ టియర్ అయినట్లు నీరజ్ స్వయంగా వెల్లడించాడు. వైద్యులు, టీమ్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో రోహిత్ యాదవ్ భారత జావెలిన్ ఆశలకు ప్రధాన బలంగా మారనున్నాడు.