నేపాల్ వరదలు.. మృత్యువును జయించారు (వీడియో)

5చూసినవారు
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న కొందరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడుతున్నారు. గల్లంతైన 10 రోజుల తర్వాత 64 ఏళ్ల వృద్ధురాలు సజీవంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నువాకోట్ టౌన్‌లో ధ్వంసమైన ఇంటి నుంచి రెస్క్యూ బృందాలు ఆమెను కాపాడాయి. ఇదే సమయంలో, త్రిశూలి టన్నెల్‌లో చిక్కుకున్న చైనా కార్మికుడిని కూడా రక్షించారు. వివిధ సొరంగాలలో మొత్తం 900 మంది కార్మికులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్