నేపాల్ ప్రధాని బాలెన్ షా తన తొలి పర్యటనలో భాగంగా ఆదివారం భారత్ చేరుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు స్వాగతం పలికారు. ఈ మేరకు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ, బాలెన్ షా సమావేశం కానున్నారు. ఇంధనం, జలవిద్యుత్, రైల్వేలు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల రంగాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.