తిరుమలలో శ్రీవారి భక్తులకు సేవలందిస్తూ నేపాల్‌కు చెందిన గూర్ఖాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. 2006లో కాలినడక మార్గాల్లో భక్తులకు భద్రత కల్పించేందుకు టీటీడీ 72 మంది గూర్ఖాలను విధుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం సుమారు 68 మంది అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో రేయింబవళ్లు గస్తీ కాస్తున్నారు. చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఉన్న అటవీ మార్గాల్లో భక్తులకు అండగా నిలుస్తున్నారు. వీరిలో చాలామంది కుటుంబాలతో సహా తిరుమలలోనే నివసిస్తూ, రెండు దశాబ్దాలుగా స్వదేశానికి దూరంగా ఉంటూ శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. భాషలు, దేశాలు వేరైనా భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నారు.