
ఖాళీ సీసాలు తిరిగిస్తే డబ్బులు.. నవంబర్ 1 నుంచి మద్యం విక్రయంలో కొత్త రూల్స్!
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నవంబర్ 1 నుంచి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం సీసాలపై రూ.10 పర్యావరణ సెస్ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు మొత్తాన్ని చెల్లించిన వినియోగదారులు, ఖాళీ సీసాలను రిటైల్ షాపుల్లో తిరిగి ఇచ్చి తమ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఎంఆర్పి ధరలోనే ఈ సెస్ కలిసి ఉంటుందని, అదనపు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సీసాల సేకరణ కోసం సిబ్బందికి ప్రత్యేక భత్యం కూడా అందనుంది.




