TG: ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 'పొలాల్లోకి ఆవిష్కరణలు' కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ మంగీలాల్ జాట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 12 పరిశోధన కేంద్రాల పరిధిలో రెండేళ్లపాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై మార్గదర్శకత్వం అందిస్తారు.