ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ కలిసి ‘సామాజిక పరివర్తన్ మోర్చా’ పేరుతో కొత్త కూటమిని ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. బీజేపీని ఓడించేందుకు ఎస్పీ,
కాంగ్రెస్ కూడా కూటమిలో చేరవచ్చని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. మరోవైపు ఈ కూటమి తరఫున ఆజాద్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒవైసీ ప్రకటించారు.