
గోవాలో ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఖాతాల్లోకి నేరుగా రూ. 3,000 జమ!
గోవా ప్రభుత్వం 'గోవా ఉజ్వల యోజన 2026'కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు ఎల్పిజి/పిఎన్జి సిలిండర్లను ఉచితంగా అందించడంతో పాటు రూ. 3,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకానికి ఆదాయ పరిమితి లేదు, కానీ కుటుంబానికి ఒక కనెక్షన్కే వర్తిస్తుంది. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేదా ఎమ్మెల్యే కార్యాలయాల్లో ఆధార్, గ్యాస్ వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.




