
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్ల పట్టివేత
TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. జైపూర్ నుంచి ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన శివరతన్ మహియా (19) అనే వ్యక్తిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఓం ప్రకాష్ రూ.20 వేల కమీషన్ ఆశచూపి ఈ నకిలీ నోట్లను రవాణా చేయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.




