
అల్బేనియా పార్లమెంట్‌పై నిరసనకారుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
అల్బేనియా రాజధాని టిరానాలో ప్రధాని ఎడీ రామా రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ అవినీతి, జీవన వ్యయానికి వ్యతిరేకంగా సాగిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారి పార్లమెంట్ భవనంపై పెట్రోల్ బాంబుల దాడి వరకు వెళ్లాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో మంటలు చెలరేగగా, పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో వందల మందికి గాయాలయ్యాయి, భద్రతా బలగాలు భారీ అరెస్టులు చేశాయి. ప్రతిపక్షాలదే బాధ్యతని, తప్పుకునే ప్రసక్తే లేదని ప్రధాని రామా స్పష్టం చేశారు.




