
భారత్ గ్యాస్ సిలిండర్ కోసం రూ.600 సూక్ష్మ రుణం
భారత్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం డబ్బులు లేని తక్కువ ఆదాయ కుటుంబాలకు ఊరటనిచ్చేలా కంపెనీ రూ.600 వరకు వడ్డీ లేని సూక్ష్మ రుణాన్ని అందిస్తోంది. 'బై నౌ, పే లేటర్' పద్ధతిలో అందించే ఈ రుణాన్ని వినియోగదారులు ఆరు వారాల పాటు వారం వారం రూ.100 చొప్పున తిరిగి చెల్లించవచ్చు. ఈ ప్రత్యేక సదుపాయం గురించి పూర్తి వివరాలు మరియు నిబంధనల కోసం అర్హులైన వినియోగదారులు తమ సమీపంలోని భారత్ గ్యాస్ పంపిణీదారులను నేరుగా సంప్రదించాలి.




