తెలంగాణలో 'మివి' నూతన ప్లాంట్ ప్రారంభం

12చూసినవారు
తెలంగాణలో 'మివి' నూతన ప్లాంట్ ప్రారంభం
TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఈ-సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన మివి నూతన తయారీ కేంద్రాన్ని శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 2025–26లో రాష్ట్ర తయారీ రంగం 7.7 శాతం వృద్ధి సాధించిందని, చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్