తెలంగాణలో కొత్తగా అర్హత పొందిన 4.72 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. గురువారం నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.2,000 చొప్పున జమ చేయనుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగే సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. పరిశీలన అనంతరం 4.72 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.