ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్

0చూసినవారు
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్
చలికాలంలో ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తుండటంతో, ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. శీతాకాల కాలుష్య నియంత్రణ ప్రణాళికలో భాగంగా, నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. అలాగే, నవంబర్ 1 నుండి జనవరి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి. దుమ్ము ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు నవంబర్ 1 నుండి జనవరి 31 వరకు నిర్మాణ, కూల్చివేత పనులపై ఆంక్షలు విధించారు. పెద్ద భవనాల్లో కాలుష్య నియంత్రణకు యాంటీ-స్మాగ్ గన్స్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.

సంబంధిత పోస్ట్