అణు పరీక్షలను పసిగట్టే సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు
అమెరికా నెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్లోని భూగర్భంలో అణుయేతర రసాయనిక పేలుడు పదార్థాలను ఉపయోగించి కొత్త ప్రయోగం చేపట్టింది. తక్కువ స్థాయి అణు విస్ఫోటనాలను గుర్తించడమే దీని లక్ష్యం. చైనా 2020లో రహస్య అణు పరీక్ష నిర్వహించిందని
అమెరికా గతంలో ఆరోపించగా, చైనా ఖండించింది. భూగర్భంలో అణు పరీక్షల ప్రకంపనలు బయటకు తెలియకుండా ఉండేందుకు దేశాలు వాడే రహస్యాలను ఛేదించడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.