కొత్త వరల్డ్ మ్యాప్.. కేంద్రం కీలక ప్రకటన

11చూసినవారు
కొత్త వరల్డ్ మ్యాప్.. కేంద్రం కీలక ప్రకటన
ఐక్యరాజ్యసమితి (UN) సాధారణ సభలో ఆమోదం పొందిన కొత్త వరల్డ్ మ్యాప్ (ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్) తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. ఖండాలను అసలు పరిమాణానికి తగినట్లుగా చూపించడమే దీని ముఖ్య ఉద్దేశమని కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దులు, వివాదాస్పద ప్రాంతాలను ఈ మ్యాప్ నిర్ధారించదని పేర్కొంది. J&K, లడఖ్ సహా భారత భూభాగాన్ని ఇండియన్ అఫీషియల్ మ్యాప్‌కు తగినట్లుగానే చూపాలని, తప్పుగా చూపించే మ్యాప్‌లను ఆమోదించేది లేదని తేల్చిచెప్పింది.

సంబంధిత పోస్ట్