భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో T20
క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ అజేయంగా 89 పరుగులు, అలెన్ 40 పరుగులతో రాణించి జట్టుకు భారీ స్కోరును అందించారు. భారత బౌలర్లలో నితీశ్, అక్షర్ మరియు అర్షీప్ తలో వికెట్ పడగొట్టారు. మరోవైపు, సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్లో వికెట్ తీయలేక 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి నిరాశపరిచారు.