మురుగు కాలువలో నవజాత శిశువు (VIDEO)

14చూసినవారు
AP: విశాఖపట్నం మద్దిలపాలెం సమీపంలోని పిఠాపురం కాలనీలో ఓ నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు డ్రైనేజీ కాలువలో పడేసి వెళ్ళిపోయారు. కాలువ నుంచి పసికందు ఏడుపు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు, అక్కడ ఉన్న గోనె సంచిని పరిశీలించగా అందులో శిశువును గుర్తించారు. వెంటనే వారు ఎంవీపీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ పసికందును రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్