ఉరి తాళ్లతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

22చూసినవారు
ఉరి తాళ్లతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన
TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల నిరవధిక సమ్మె సోమవారానికి ఏడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు మెడలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం, ఆరోగ్య మంత్రి స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్