
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ పట్టణంలోని BRS క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఖానాపూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 24 గంటల విద్యుత్ హామీ ఏమైందని, రైతులకు కేవలం 6 గంటలే కరెంటు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు పెరిగాయని, నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిరంతర విద్యుత్ సరఫరా అయిందని, ప్రస్తుత పరిస్థితి ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
























