నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆదివాసీ
కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ
కాంగ్రెస్ వల్ల కరువు అనడం బీఆర్ఎస్ పైశాచిక ఆనందమన్నారు. బ్రిటన్, జపాన్ లో
కాంగ్రెస్ ఉందా? అక్కడా కరువు ఉంది. ఇది ఎల్ నినో ప్రభావమన్నారు. 2015లో కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి హక్కులు తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. పాలమూరు, భీమా, డిండి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేశారని, కొండపోచమ్మ నుంచి
కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తరలిస్తున్నారని, యాదాద్రిలో 8 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.