Sep 29, 2026, 17:09 IST/
బలూచ్ మహిళా రెబల్స్ దాడి.. 9 మంది పాక్ సైనికులు మృతి!
Sep 29, 2026, 17:09 IST
బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF)కి చెందిన 'కరీమా' అనే మహిళా సాయుధ విభాగం, సీపీఈసీ హైవే వద్ద పాకిస్థాన్ సైనిక కాన్వాయ్పై మెరుపుదాడికి పాల్పడింది. ఈ దాడిలో తొమ్మిది మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. బలూచ్ ప్రావిన్స్లోని చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) హైవే సమీపంలో ఈ ఘటన జరిగింది. దాడికి సంబంధించిన వీడియోను BLF విడుదల చేసింది. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమైనట్లు బలూచ్ మహిళా విభాగ ప్రతినిధి తెలిపారు.