Sep 26, 2026, 10:09 IST/
పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి.. దున్నపోతును తెచ్చుకున్నారు: కేటీఆర్
Sep 26, 2026, 10:09 IST
TG: ప్రజలు పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనాల్లో ఎటు చూసినా 'దేక్ లెంగే' పాటలు, కేసీఆర్ పేరు వినిపించిందని, మూడేళ్లు కేసీఆర్ బయటకు రాకపోయినా ప్రజల ఆదరణ తగ్గలేదని అన్నారు. ప్రతి మహిళ, ఆడబిడ్డ కేసీఆర్ను తలచుకుంటున్నారని, ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని తెలిపారు.