మామడ మండలం - Maamada Mandal

నిర్మల్ జిల్లా
వరసిద్ధి వినాయకుని సన్నిధిలో వాసవి విద్యార్థుల నృత్యప్రదర్శన
Sep 17, 2026, 15:09 IST/నిర్మల్
నిర్మల్

వరసిద్ధి వినాయకుని సన్నిధిలో వాసవి విద్యార్థుల నృత్యప్రదర్శన

Sep 17, 2026, 15:09 IST
నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తానూర్ వాసవి పాఠశాల విద్యార్థులు ఆలపించిన భక్తిగీతాలు, చేసిన క్లాసికల్, జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల అద్భుతమైన అభినయం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. విద్యార్థుల ప్రతిభను, ఉపాధ్యాయుల కృషిని ఆలయ కమిటీ నిర్వాహకులు కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్, డైరెక్టర్ నర్సయ్య, ఉపాధ్యాయులను ఆలయ కమిటీ సభ్యులు జ్ఞాపికలతో సన్మానించారు.