Oct 11, 2026, 17:10 IST/
రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారతీయుడి మృతి
Oct 11, 2026, 17:10 IST
సౌదీ అరేబియాలోని రియాద్ ఎయిర్పోర్టుపై హూతీల దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒక భారతీయుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు అక్కడి భారత ఎంబసీ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందిస్తామని పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శనివారం జరిగిన దాడిలో మృతుల సంఖ్య 12కు చేరింది.