Sep 24, 2026, 09:09 IST/
బంగ్లాదేశ్లో భగ్గుమన్న ఇంధన ధరలు.. లీటరుకు ఏకంగా 20 టాకాలు పెంపు
Sep 24, 2026, 09:09 IST
తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను లీటరుకు 20 టాకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజిల్ ధర 115 నుంచి 135 టాకాలకు, పెట్రోల్ ధర 140 నుంచి 160 టాకాలకు పెరిగింది. గత ఏడు నెలల్లో ఇది మూడోసారి ధరల పెంపు. రవాణా, సాగు వ్యయం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.