Sep 17, 2026, 12:09 IST/
భూవివాదంపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
Sep 17, 2026, 12:09 IST
TG: నానక్రామ్గూడ భూ వివాదంపై నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ భూమిపై తమకే హక్కులు ఉన్నాయని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ తమ వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. తాము అక్రమంగా భూమిలోకి వెళ్లలేదని, గేట్లు పగులగొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాను, సునీల్ అనే వ్యక్తి కలిసి నానక్రామ్గూడలో రైతుల దగ్గర భూములు కొన్నామని ఆయన పేర్కొన్నారు.