Oct 08, 2026, 08:10 IST/
అంతర్జాతీయ ప్రయాణికులకు టాటా కొత్త సిమ్
Oct 08, 2026, 08:10 IST
విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్ 'ఈజీరోమ్' అనే కొత్త ఇంటర్నేషనల్ ట్రావెల్ సిమ్ను ప్రారంభించాయి. దీని ద్వారా విదేశీ రోమింగ్ ఛార్జీల భారం తగ్గుతుంది. పన్నులు మినహాయించి రూ.241తో ప్రారంభమయ్యే ఈ సిమ్ను ఎయిర్ ఇండియా వెబ్సైట్ ద్వారా టికెట్ బుకింగ్ సమయంలోనే పొందవచ్చు. ప్రారంభ ఆఫర్లో ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 30 దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవను త్వరలో 190కి పైగా దేశాలకు విస్తరించనున్నారు. డేటా ప్లాన్ కొనుగోలుదారులకు 1జీబీ వరకు ఉచిత డేటా లభిస్తుంది.