నీతా అంబానీ భరతనాట్యం.. వీడియో వైరల్

17చూసినవారు
రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ మరోసారి భరతనాట్య ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 13 వరకు ఎన్ఎంఏసీసీ ఆధ్వర్యంలో జరగనున్న ‘ది గ్రేట్‌ ఇండియన్‌ మ్యూజికల్‌: సివిలైజేషన్‌ టు నేషన్‌’ వేడుకలో ఆమె నృత్యం చేయనున్నారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ వీడియోను స్వదేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రోజ్‌ పింక్‌ లెహంగాలో సంప్రదాయ ఆభరణాలతో మెరిసిన నీతా.. తనకు ఆరేళ్ల వయసు నుంచే నృత్యంపై ఆసక్తి ఉందని, తొమ్మిదేళ్లకే తొలిసారి వేదికపై ప్రదర్శన ఇచ్చానని తెలిపారు. భారతీయ సంస్కృతి, వారసత్వ కళలకు తన నృత్యాన్ని అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్