
గుజరాత్లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
గుజరాత్లోని అహ్మదాబాద్లో బుధవారం 10 ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు, బాంబ్ స్క్వాడ్లు తనిఖీలు చేపట్టి ఇవి బూటకపు బెదిరింపులని నిర్ధారించారు. జీడస్, బోడక్దేవ్, సెంట్ కబీర్ వంటి స్కూళ్లకు బెదిరింపులు రావడంతో ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను ఇళ్లకు పంపించారు. తమను 'ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ'గా పేర్కొంటూ ఈ మెయిల్స్ పంపారని, నరేంద్ర మోదీ స్టేడియంలోనూ పేలుళ్లు జరుపుతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.





























