
అమీనాపూర్ లో పిచ్చి కుక్కల సైర విహారం
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ ఆరుగురిపై దాడి చేసింది. బాంగ్లా నర్సా గౌడ్, అవును లోకేష్, పాకాల శ్రీనివాస్ గౌడ్, తోకల మధునిత, శివన్షి, మరియు వర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆర్మూర్ మరియు వేల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సర్పంచ్ గుండె సౌందర్య నవీన్ బాధితులను శుక్రవారం పరామర్శించారు. వైద్యులు బాధితులకు ప్రథమ చికిత్సతో పాటు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు అందజేశారు. గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.



































