పూర్వ విద్యార్థులఆత్మీయ సమ్మేళనం

11చూసినవారు
పూర్వ విద్యార్థులఆత్మీయ సమ్మేళనం
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో 1990-91 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంతో కాలం తర్వాత స్నేహితులందరూ ఒకచోట చేరారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఒకరికొకరు పలకరించుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. నాటి మిత్రుల కలయికతో వేల్పూర్ ప్రాంతం సందడిగా మారింది, స్నేహితులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్