బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడలో 1986-87 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ఇజ్రాయిల్లో ఉంటున్న పీరి అనంతరావు కృషితో మిత్రులందరూ ఒకే వేదికపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న తమ తోటి మిత్రుడు సయ్యద్ బాసీద్ను స్నేహితులు ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను, అల్లరి పనులను నెమరువేసుకుంటూ ఒకరికొకరు ఆత్మీయ పలకరింపులు చేసుకున్న ఈ వేడుక మధుర జ్ఞాపకాలను మిగిల్చింది.