నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామానికి చెందిన రఘుపతి వినోద్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధితుడికి రూ. 2 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. వైద్య సహాయం కోసం ఎమ్మెల్యే అందించిన ఆర్థిక చేయూత పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితుడికి అండగా నిలిచారు.