
మార్కండేయ మందిరాన్ని సందర్శించిన దేవదాయ శాఖ ఇంజనీర్
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనుల్లో భాగంగా దేవాదాయ శాఖ ఇంజనీర్లు, స్థపతులు గురువారం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని విగ్రహాలు, పరిసరాల కొలతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ ఏఈ రమేష్, స్తపతి వెంకటేష్ ఆలయాన్ని సందర్శించి, ఎస్టిమేట్ కోసం అవసరమైన డిపాజిట్లు వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్, కార్యదర్శి మేక నగేష్, గంగాధర్, గంగా కిషన్, భోగ భూమేష్ పాల్గొన్నారు.
















