Sep 12, 2026, 16:09 IST/
ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి
Sep 12, 2026, 16:09 IST
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతురాలు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హేమగా గుర్తించారు. మృతురాలు బంజారాహిల్స్ లోని ఓ కార్ల షోరూమ్లో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.