
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఏడుగురికి తీవ్ర గాయాలు
బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. పందుల వేట కోసం మోపెడ్‌పై తరలిస్తున్న నాటు బాంబులు ఒక్కసారిగా పేలడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వైశాలి (6), శ్రీదేవి (5), అంజలి (7)తో పాటు రాజు, లక్ష్మణ్, వెంకయ్య, రమేష్ ఉన్నారు. వీరిలో శ్రీదేవి, అంజలి, రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
































