Oct 03, 2026, 19:10 IST/
అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి
Oct 03, 2026, 19:10 IST
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో రిచ్మండ్ హైయిట్స్లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ వడ్తల్ ధామ్ హిందూ మందిర్పై ఇటుకలతో దాడి జరిగింది. అక్టోబర్ 3న మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆలయంలోని కిటికీలు దెబ్బతిన్నాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. అధికారులు నిఘా వీడియోలను పరిశీలిస్తున్నారు. ఇటీవల అమెరికాలో భారతీయులపై దాడులు పెరిగాయి.