
అమ్దాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
అమ్దాపూర్ గ్రామంలోని గల్లిక గణేష్ మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు 6వ సభ్యురాలు దుర్గ పోతంకర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు.




































