Sep 25, 2026, 02:09 IST/బాల్కొండ
బాల్కొండ
వేంపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ఏర్పాటు
Sep 25, 2026, 02:09 IST
ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని హోటల్లు, చికెన్ షాపుల యజమానులకు, మహిళలకు పిల్లలకు అవగాహన కల్పించారు. దోమల నివారణ, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేష్ యాదవ్, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.