
అంబులెన్స్ లో ప్రసవం
పెద్ద కొడంగల్ మండలం కాటేపల్లి తండా గ్రామానికి చెందిన కల్లబాయి డెలివరీ కోసం 108 అంబులెన్స్ లో వెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కవడం వలన మార్గమధ్యంలోనే అంబులెన్స్ లో ఈఎంటి లక్ష్మణ్ డెలివరీ చేయడం జరిగింది. ఆమె ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. డెలివరీ నిర్వహించిన ఈఎంటి లక్ష్మణ్, పైలట్ విజయ్ కు శైలజ భర్త కృతజ్ఞతలు తెలియజేసారు. తదుపరి చికిత్స కోసం బాన్సువాడ మాత శిశు ఆసుపత్రికి తరలించారు.






























