Sep 08, 2026, 15:09 IST/
పెళ్లి పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం
Sep 08, 2026, 15:09 IST
AP: అన్నమయ్య జిల్లాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని, శ్రీరాములపల్లికి చెందిన నరేష్తో నాలుగేళ్ల క్రితం మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది. నరేష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సుమారు రూ.40 లక్షలు, కారు కొనిపించి మోసం చేశాడని యువతి ఆరోపించింది. ఏడాది క్రితం ముదివేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తాజాగా నరేష్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని తెలుసుకుని, అంగళ్లు అవుట్పోస్ట్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.