Sep 01, 2026, 14:09 IST/
వరదలో చిక్కుకున్న బైకర్‌ను కాపాడిన నవవధువు
Sep 01, 2026, 14:09 IST
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో అకస్మాత్తుగా సంభవించిన వరదలో చిక్కుకున్న ఓ బైకర్‌ను నవవధువు, మరో ఇద్దరు మహిళలు తమ చున్నీ సాయంతో రక్షించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రాణాల కోసం పోరాడుతున్న బైకర్‌ను కాపాడేందుకు నవవధువు చున్నీని తాడుగా మార్చి విసిరింది. అతను దానిని పట్టుకోగా, కారులో ఉన్నవారు అతన్ని సురక్షితంగా బయటికి లాగారు. ఈ చర్యకు నెటిజన్లు నవవధువును ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.