Sep 14, 2026, 14:09 IST/నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్
ధర్పల్లిలో పద్మశాలి సంఘం ఘనంగా గణేష్ ఉత్సవాలు
Sep 14, 2026, 14:09 IST
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలు, ఆకులు, పండ్లు, విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపంలో కొలువుతీరిన గణనాథునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. చిన్నపెద్దలంతా కలిసి భజనలు, కీర్తనలతో భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో కుల బాంధవులు, పెద్దలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.