Sep 24, 2026, 16:09 IST/
విద్యుత్ షాక్తో ఇద్దరు చిన్నారుల మృతి
Sep 24, 2026, 16:09 IST
AP: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన సూర్య (14), సాయి (12) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. ఆడుకునే క్రమంలో ఎర్త్వైర్ను పట్టుకోవడంతో, దానికి విద్యుత్ ప్రవహించి ఈ దుర్ఘటన జరిగింది. సూర్య 8వ తరగతి, సాయి 6వ తరగతి చదువుతున్నారు. చిన్నారుల ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.