నాగిరెడ్డిపేట మండలం - Naga_Reddipet

నిజామాబాద్ జిల్లా
పెళ్లైన 18 రోజులకే నవ వరుడి ఆత్మహత్య
Sep 26, 2026, 00:09 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

పెళ్లైన 18 రోజులకే నవ వరుడి ఆత్మహత్య

Sep 26, 2026, 00:09 IST
పెళ్లైన 18 రోజులకే ఓ నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంధిల భాను ప్రకాశ్ (21) గ్రామ శివారులోని పూరిగుడిసెలో ఉరేసుకుని మృతి చెందాడు. భాను ప్రకాశ్‌కు ఈ నెల 7న వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే వైవాహిక జీవితం కొనసాగించేందుకు భార్య ఇష్టం లేదని చెప్పడంతో భాను ప్రకాశ్ మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.