Oct 01, 2026, 01:10 IST/
‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకం.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
Oct 01, 2026, 01:10 IST
తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు' అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి దరఖాస్తు గడువు SEP 30తో ముగిసింది. ఈ పథకం కోసం 4.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి 1,000 కుట్టు మిషన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల మందికి ఇవ్వనుంది. అప్లికేషన్ల గడువు ముగియడంతో అధికారులు ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నం కానున్నారు.