
ధర్పల్లిలో ఘనంగా దేవీ నవరాత్రి అన్నదాన కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు దేవీ నవరాత్రుల సందర్భంగా పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన సత్రం ఘనంగా జరిగింది. అమ్మవారి పూజ మండపం వద్ద యజ్ఞం మరియు సత్యనారాయణ వ్రతం నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మమతా రాజ్ కుమార్, పవర్ యూత్ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

































