Sep 26, 2026, 07:09 IST/బాల్కొండ
బాల్కొండ
మోతే గ్రామంలో డిజిటల్ పంటల నమోదు కార్యక్రమం
Sep 26, 2026, 07:09 IST
వేల్పూర్ మండలం మోతే గ్రామంలో సర్పంచ్ దొల్ల రమేష్ రెడ్డి, AEO షబ్బీర్ డిజిటల్ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ పంట వివరాల సర్వేను త్వరగా పూర్తి చేసి, రైతుల పంట వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సర్వే వాలంటీర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు గంగారెడ్డి, చెపూరి మహేష్, చరణ్ పాల్గొన్నారు.